రామ్‌ చరణ్‌తో ప్రభాస్‌ సినిమా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

-

సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్లు కొత్తేం కాదు. కానీ కొన్ని మల్టీస్టారర్లు మాత్రం చాలా ప్రత్యేకం. అలా తాజాగా ఓ క్రేజీ మల్టీస్టారర్ గురించి రెబల్ స్టార్ ప్రభాస్ హింట్ ఇచ్చారు.  ప్రతిష్ఠాత్మకమైన ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ ఈవెంట్లో ప్రాజెక్టు-కె చిత్రబృందం పాల్గొని సినిమా టైటిల్..( ‘కల్కి 2898 ఏడీ’ ), గ్లింప్స్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీమ్‌ అంతా అక్కడి మీడియాతో మాట్లాడింది. అందులో ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

అలాగే రామ్ చరణ్‌ల గురించి ప్రభాస్‌ మాట్లాడుతూ.. ‘‘ రామ్‌చరణ్‌ నాకు మంచి స్నేహితుడు. ఏదో ఒక రోజు మేమిద్దరం కలిసి కచ్చితంగా సినిమా చేస్తాం’’ అని ప్రభాస్ అసలు సర్ ప్రైజ్ గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్‌, రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో సినిమా వస్తే అది బిగ్‌ మల్టీస్టారర్‌ అవుతుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు రాజమౌళి గురించి మాట్లాడుతూ.. భారత్‌లో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చాలా గొప్ప సినిమా. ఆ సినిమాలోని పాటకు ఆస్కార్‌ రావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అది భారతదేశ ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావించాం. అలాగే రాజమౌళి ఇలాంటి వాటికి అర్హుడు. అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news