Beauty Tips : ఈ ఒక్క చిట్కా తో జుట్టు సమస్యలు అన్నీ దూరం..!

-

Beauty tips : చాలామంది జుట్టు సమస్యలతో బాధపడతారు. జుట్టు రాలిపోవడం జుట్టు పాడైపోవడం ఇలా ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే ఇటువంటి సమస్యలు అన్నిటికీ పరిష్కారం అరటిపండు తో పొందవచ్చు. అరటిపండుతో మనం జుట్టుని అందంగా చక్కగా మార్చేసుకోవచ్చు. తలకి అరటి పండుని పట్టించడం వలన జుట్టు సిల్కీగా కూడా మారుతుంది. సిల్కీ హెయిర్ కావాలనుకునే వాళ్ళు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగక్కర్లేదు ఇంట్లోనే ఈజీగా మనం జుట్టు సిల్క్ గా మార్చుకోవచ్చు.

Beauty tips
Beauty tips

 

అరటిపండుని జుట్టుకి ఉపయోగిస్తే జుట్టు ఒత్తుగా ఎదగడమే కాకుండా మెరిసిపోతూ ఉంటుంది అరటిపండు జుట్టుకి బలాన్ని కూడా ఇస్తుంది. అరటిపండు హెయిర్ మాస్క్ ని జుట్టుకి అప్లై చేస్తే చుండ్రు కూడా పోతుంది. తలకి తేమ అందుతుంది జుట్టు బాగా మృతువుగా తయారవుతుంది. అరటిపండు గుడ్డు బాగా ఉపయోగపడతాయి.

హెయిర్ మాస్క్ చేయడానికి రెండు గుడ్లు అరటి పండు తీసుకుని మిక్స్ చేయాలి దీనిని జుట్టుకు పట్టించి కాసేపు వదిలేసి తర్వాత తల కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన వెంట్రుకలు రాలవు బలంగా దృఢంగా ఉంటాయి. అరటి పండు ని కొబ్బరి నూనెని తలకి పట్టిస్తే కూడా జుట్టు బాగుంటుంది జుట్టు సాఫ్ట్ గా అయిపోతుంది. అరటిపండు తేనె ని కూడా మీరు తలకి పట్టించొచ్చు ఇది కూడా జుట్టుని మృదువుగా మారుస్తుంది. ఇక మీకు కురులు సమస్యలు ఏమి ఉండవు. చక్కగా ఒత్తుగా సాఫ్ట్ గా మీ హెయిర్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news