రజినీకాంత్ ఫౌండేషన్ పేరుతో ‘బిగ్ స్కామ్’

-

తలైవా రజనీకాంత్ స్థాపించిన స్వచ్ఛంద సేవా సంస్థ ‘రజనీకాంత్ ఫౌండేషన్’ పేరుతో కొంతమంది మోసాలకు పాల్పడుతున్న విషయం పోలీసుల దృష్టికి చేరింది. నకిలీ ఖాతాల ద్వారా వేలాది మందిని తప్పుదోవ పట్టిస్తున్నారని సంస్థ ట్రస్టీ శివరామకృష్ణన్ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబయి పెనిన్సులా పార్క్​ టవర్,​ బిజినెస్​ పార్క్​ అడ్రస్​కు చెందిన ఓ బోగస్​ ఫౌండేషన్..​ ఇలా చేస్తోందని తెలిపారు. లక్కీ డ్రా ఏర్పాటు చేశామని ఎంపికైన వారికి ఉచితంగా బహుమతులు డోర్ డెలివరీ చేస్తామని మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులో శివరామకృష్ణన్ పేర్కొన్నారు. సోషల్​ మీడియా ద్వారా ఇలాంటి తప్పుడు​ ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు పోలీసులకు వివరించారు.

‘రజనీకాంత్​ ఫౌండేషన్’ పేరుతో మోసాలకు పాల్పడుతూ.. ఆ సంస్థతో పాటు రజనీకాంత్​ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు. ఫౌండేషన్​ నుంచి సాయం అందుతుందని నమ్మి బాధితులు మోసపోయారు. ఇది కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు. రజనీకాంత్​ ఫౌండేషన్ పేరును, ఇమేజ్​ను దుర్వినియోగం చేస్తూ.. కోయంబత్తూర్​, బిహార్​, తిరువనంతరపురం ప్రాంతాల్లోనూ మోసపూరిత కార్యకలాపాలు జరుగుతున్నాయి.’ అని శివరామకృష్ణన్ ఫిర్యాదులో ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news