తెలంగాణలోని దివ్యాంగులకు రాష్ట్ర సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. ఇప్పటి వరకు వారికి రాష్ట్ర సర్కార్ అందిస్తున్న ఆసరా పింఛన్‌ను రూ.4,016కు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన పింఛన్ జులై నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇవాళ రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల మంత్రులతో సీఎం కేసీఆర్ నిర్వహించారు. ఈ సమీక్షలోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పింఛన్ పెంపు ద్వారా రాష్ట్రంలోని 5 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఆసరా పింఛన్ పెంచడంపై రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్లు తెలంగాణలోనే ఇస్తున్నామని.. దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు.