ఆ సినిమాలో ఆలియా భట్​ను చూసి ఏడ్చేశా : సుధామూర్తి

-

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, సోషల్ వర్కర్, రచయిత్రి సుధామూర్తి.. ఈ తరం నటీనటుల్లో తన ఫేవరెట్ ఎవరో చెప్పారు. ఇటీవల ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ సినిమా చూసి అందులో హీరోయిన్ నటనకు ఫిదా అయినట్లు తెలిపారు. ఒక క్రమంలో ఆ నటి నటనను చూసి ఏడ్చేశానంటూ వెల్లడించారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్.

సినిమాల్లో ఎమోషనల్​ సీన్స్​ చూసి తానెప్పుడూ కంటతడి పెట్టుకోలేదని.. కానీ ‘రాజీ’ సినిమాలోని ఆలియా నటన చూసి ఏడ్చేశానంటూ సుధామూర్తి చెప్పారు. ఆ మూవీలో ఆలియా భట్ అద్భుతంగా నటించారని​ కొనియాడారు. “థియేటర్లలో తొలిసారిగా 1958లో సినిమా చూశా. అప్పటి నుంచి వైజయంతీమాలను అభిమానించడం ప్రారంభించాను. ఇక నర్గిస్‌ నటననూ ఇష్టపడతాను. ఈతరంలో అయితే అలియా భట్‌ నటనను అభిమానిస్తాను. ఆమె గ్రేట్‌ యాక్టర్‌”  అని పేర్కొన్నారు.  తరచూ సినిమాలకు సంబంధించిన ఎడిటింగ్‌, సంగీతం గురించి తమ ఇంట్లో చర్చించుకుంటుంటామని సుధా మూర్తి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news