పోలండ్‌ వైపు ‘వాగ్నర్‌’ చూపు.. బెలారస్‌లోనే నియంత్రిస్తున్న లుకషెంకో

-

బెలారస్‌ సైన్యానికి శిక్షణ ఇస్తున్న వాగ్నర్‌ దళాలు పోలండ్‌ సరిహద్దుల్లో నాటో దళాలను వెనక్కు వెళ్లగొట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు తెలిపారు. పశ్చిమ దిశగా దాడులు చేద్దామని వాగ్నర్‌ సైనికులు చాలా ఒత్తిడి చేస్తున్నారని.. వార్సాకు వెళదామని చెబుతున్నారని అన్నారు. వారిని మధ్య బెలారస్‌లోనే నియంత్రిస్తున్నామని పుతిన్‌కు లుకషెంకో వివరించారు. వాగ్నర్‌ దళాలు బెలారస్‌లో అడుగుపెట్టాయని తెలియగానే.. పోలండ్‌ తమ దళాలను బెలారస్‌ సరిహద్దులకు తరలించింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్.. బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకోతో ఆదివారం భేటీ అయ్యారు. ఇటీవల రష్యాలో వాగ్నర్‌ గ్రూపు తిరుగుబాటు తర్వాత వీరి భేటీ జరగడం ఇదే తొలిసారి. తిరుగుబాటు సమయంలో రష్యా నాయకత్వానికి, వాగ్న ర్‌ గ్రూప్‌ మధ్య దౌత్యం నిర్వహించింది లుకషెంకోనే. తాజాగా సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో వీరు భేటీ అయిన వీడియోను బెలారస్‌ ప్రెస్‌ సర్వీస్‌ పోస్టు చేసింది. భేటీ అనంతరం పుతిన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ ఎదురుదాడులు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news