ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.4.42 లక్షల కోట్లు !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అప్పులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2023 మార్చి నాటికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అప్పులు రూ. 4.42 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.

తెలుగు రాష్ట్రాల అప్పులపై లోక్ సభలో BRS MP నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ.2.64 లక్షల కోట్లుగా ఉండగా…2022మార్చికి 3.93 లక్షల కోట్లకు… 2023 మార్చికి రూ. 4.42 లక్షల కోట్లకు చేరినట్లు నిర్మలా వెల్లడించారు. అటు తెలంగాణ రాష్ట్రం 2023 సంవత్సరం నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం రూ.3,66,306 కోట్ల అప్పులు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2019 నుంచి 2023 ఆర్థిక ఏడాది వరకు తెలంగాణ చేసిన అప్పుల వివరాలను వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news