హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల లాగ్-ఔట్ వేళల మార్పు పొడిగింపు

-

తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. బుధవారం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్ జారీ చేయగా, దక్షిణ తెలంగాణ పూర్తిగా ఆరెంజ్ వార్నింగ్‌లో ఉంది. రేపు దాదాపుగా 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రెడ్ అలర్ట్‌ ప్రకటించామని అధికారులు వెల్లడించారు.

IKEA Hyderabad — Guerrilla marketing at its best | by Soham Kulkarni |  Strategy Insider | Medium

భారీ వర్ష సూచన నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. లాగ్-ఔట్ ను మూడు ఫేజ్ లుగా విభజించింది. దీనిని తొలుత ఈ రోజు వరకు పరిమితం చేయగా, ఇప్పుడు ఆగస్ట్ 1 వరకు పొడిగించారు. మూడు దశల్లో ఐటీ ఉద్యోగులు లాగ్-ఔట్ కావాలి. ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ కార్యాలయాలు సాయంత్రం మూడు గంటలకు, ఐకియా నుండి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉంటే కార్యాలయాలు సాయంత్రం గం.4.30కు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ కార్యాలయాల ఉద్యోగులు సాయంత్రం మూడు గంటలకు లాగ్ ఔట్ చేయాలని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news