ఏపీ డీజీపీ: మిస్ అయిన 23 వేల మంది మహిళలను గుర్తించాం…

-

నిన్న పార్లమెంట్ లో వర్షాకాల సమావేశంలో భాగంగా తెలుగు రాష్ట్రాలలో వివిధ కారణాలతో మిస్ అయిన మొత్తం అమ్మాయిలు మరియు మహిళల లెక్కలను కేంద్ర హోమ్ శాఖ బయటపెట్టిన సంగతి తెలిసిందే. కాగా వీరి లెక్కల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో తప్పిపోయిన 26 వేల మంది మహిళలు ఉన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి కాసేపటి క్రితమే స్పందించారు. ఈయన తెలిపిన వివరాల ప్రకారం… తప్పిపోయిన మహిళల్లో ఇప్పటికే 23 వేల మందిని గుర్తించారు. ఇంకా మిగిలిన మహిళలను పట్టుకోవడానికి విచారణలు చేస్తున్నామని ఈయన ప్రకటించారు. కాగా తప్పిపోయిన వారి కొసం ఎంక్వయిరీ చేయగా వారు వివిధ కారణాల వలన తప్పిపోయినట్లు డీజీపీ వివరించారు. అంటే ఈయన ఉద్దేశ్యం ప్రకారం వాలంటీర్ల ద్వారా సమాచారం లీక్ అయ్యి సంఘ విద్రోహ శక్తులు వీరి అదృశ్యానికి కారణం కాదని స్పష్టంగా అర్ధమవుతోంది.

కొన్ని చోట్ల ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలను తగ్గించడానికి పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news