బీజేపీకి జగన్ ఫుల్ సపోర్ట్..బాబు పొజిషన్ ఏంటి?

-

రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగానే ఉండాలనే ఫార్ములా సి‌ఎం జగన్ బాగా అమలు చేస్తున్నారు. అనవసరంగా కేంద్రంతో కయ్యం పెట్టుకుని రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో నెట్టాలని అనుకోవడం లేదు. అందుకే ఏపీకి విభజన చట్టం ప్రకారం కేంద్రం చాలా చేయాల్సి ఉన్న..జగన్..నిదానంగా కేంద్రంతో మంచిగా ఉంటూ కావల్సిన పనులు చేయించుకుంటున్నారు. ఇక జగన్ కు కేంద్రం కూడా బాగా సహకరిస్తుంది. ఇటీవల పోలవరం నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చింది. ఎప్పటికప్పుడు ఆదుకుంటూనే ఉంది.

అందుకే జగన్ సైతం..అవసరమైనప్పుడు కేంద్రానికి సపోర్ట్ గా ఉంటున్నారు. న్యూట్రల్ గా ఉంటూనే..కీలక బిల్లుల సమయంలో కేంద్రానికి మద్ధతుగా నిలుస్తున్నారు. వైసీపీకి ఉన్న ఎంపీల బలం బి‌జే‌పికి అవసరం అవుతుంది.ఇక ఇప్పుడు మణిపూర్ ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్..మోదీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. దీని విపక్ష పార్టీలు మద్ధతు ఇస్తున్నాయి. ఇటు తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది.  కానీ వైసీపీ మాత్రం…బి‌జే‌పికే మద్ధతు ఇస్తుంది..

ఇక జాతీయ రాజధాని ఢిల్లీలోని అధికారలపై మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తోంది. ఢిల్లీలో ప్రజలకు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండాల్సిన అధికారాలను కేంద్రం లాక్కుంటోందని చాలా కాలం నుంచి సి‌ఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీన్ని అందరూ వ్యతిరేకించాలని అన్ని పార్టీలను, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేజ్రీవాల్ అభ్యర్థించారు.

ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్‌ కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. వైసీపీ మాత్రం కేంద్రానికి మద్దతుగా నిలిచింది. వైసీపీ మద్ధతుతో ఎన్డీఏకు రాజ్యసభలో సంఖ్యాబలం పెరిగింది. 237 మంది పార్లమెంటు సభ్యుల సభలో ఓటు వేయాల్సి ఉండగా, ప్రతిపక్ష కూటమికి 108, ఎన్డీయేకు 123 ఓట్ల మెజారిటీ ఉంది. ఇలా జగన్..బి‌జే‌పికి సపోర్ట్ గా నిలవడంతో..బి‌జే‌పి మద్ధతు ఎల్లప్పుడు జగన్ కే ఉంటుంది. ఇలాంటి సమయంలో బి‌జే‌పితో పొత్తు విషయంలో చంద్రబాబు ఎలా ముందుకెళ్తారు. అలాగే టి‌డి‌పికి ఉన్న నలుగురు ఎంపీలతో ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. చూడాలి మరి బాబు ఏం చేస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news