మరాఠా వంటకాలకు రాష్ట్రపతి ఫిదా.. చెఫ్​లకు దిల్లీ నుంచి ఆహ్వానం

-

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల పలు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించారు. అందులో భాగంగానే ఈ నెల 7న ద్రౌపదీ ముర్ము మహారాష్ట్రలోని షిర్డీ సాయి మందిరానికి వెళ్లారు. సాయిబాబా దర్శనానంతరం.. అక్కడి ఆలయ అధికారులు సాయిబాబా సంస్థాన్‌లోని సాయి ప్రసాదాలయంలో రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మరాఠా వంటకాలను రుచి చూపించారు. ఆ వంటను రుచిచూసిన ముర్ము.. ఆ డిషెస్ టేస్ట్​కు ఫిదా అయ్యారు. భోజనాంతరం ఆ వంటలు తయారు చేసిన చెఫ్​లతో ప్రత్యేకంగా ముచ్చటించి.. మరాఠా రుచులు చాలా బాగున్నాయని అభినందించారు. ముఖ్యంగా వేరుశనగతో తయారు చేసిన చట్నీ గురించి ఆ వంటవాళ్లను అడిగి తెలుసుకున్నారు.

షిర్డీ దర్శనం అనంతరం ప్రత్యేక విమానంలో ద్రౌపదీ ముర్ము దిల్లీ వెళ్లిపోయారు. ఆ తరువాత దిల్లీ రాష్ట్రపతి కార్యాలయం నుంచి సాయి ప్రసాదాలయంలో వంటలు తయారు చేసే ఇద్దరు వంటగాళ్లకు పిలుపు వచ్చింది. రాష్ట్రపతి భవన్‌లో ఆ మరాఠా రుచులను సిద్ధం చేయాలని రాష్ట్రపతి కార్యాలయానికి చెందిన ఓ అధికారి నేరుగా ఫోన్​ చేసి మరీ ఆహ్వానించారు. ఈ క్రమంలోనే చెఫ్స్ రవీంద్ర, ప్రహ్లాద్ ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news