ట్యాక్సీ డ్రైవర్ తో అక్రమ సంబంధం..కానిస్టేబుల్ ను చంపిన భార్య !

-

విశాఖలో విషాదం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ రమేష్ అనుమానస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. ప్రియుడుతో కలిసి భర్తను కడ తేర్చింది భార్య శివాని. ఈ సంఘటనపై పోలీసుల చేసిన విచారణలో విస్తు పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిజాన్ని ఎట్టకేలకు అంగీకరించింది కానిస్టేబుల్ భార్య. నీలా అనే వ్యక్తికి రెండు లక్షల సుఫారీ ఇచ్చి మర్డర్ చేసేందుకు ప్లాన్ వేశారు ప్రియుడు రామారావు , భార్య శివాని. పెళ్లికి కట్నం కింద అరెకరం భూమి రమేష్ అత్తమామలు ఇచ్చారు.

ఆ ఆరెకరం భూమిపై కన్నేసిన భార్య శివాని,ప్రియుడు రామారావు…కానిస్టేబుల్ రమేష్ ను చంపేశారు. ఆ అర ఎకరం భూమి అమ్మేసి ప్రియుడితో కలిసి సెటిల్ అవుదామని భావించింది భార్య. అయితే.. కాల్ డేటా, వాట్సాప్ చాట్ ఆధారంగా లోతైన దర్యాప్తు చేశారు పోలీసులు. అటు శివాని తల్లిదండ్రుల మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే.. గతంలో రమేష్‌, శివాని మధ్య అక్రమ సంబంధంపై గొడవ జరిగిందట. ఈ కలహాలు కారణంగా రమేష్ మద్యపానానికి బానిసగా మారాడు. తన లోపల కృంగి పోయి ఏం చెయ్యలేని స్థితిలోకి వెళ్లిపోయాడు రమేష్. ఇక రమేష్ అడ్డు తప్పించాలని మత్తు టాబ్లెట్స్ వేసి.. తల దిండు మొహానికి అడ్డు పెట్టి చంపారు నిందితులు. చంపే సమయంలో వీడియోలు కూడా రమేష్‌ భార్య శివాని తీసింది. ఇక ఈ కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

https://twitter.com/VizagNewsman/status/1687329791895289857?s=20

Read more RELATED
Recommended to you

Latest news