పూర్వం చాలామంది గంజి తాగే వారు ఈ రోజుల్లో గంజి తాగే వారి సంఖ్య బాగా తగ్గింది. గంజి వలన అనేక రకాల లాభాలని పొందొచ్చు. అయినా కూడా చాలా మంది గంజిని తీసుకోవడం లేదు. అన్నం వార్చిన తర్వాత గంజిని చాలా మంది పారేస్తున్నారు. కానీ పాత రోజుల్లో అన్నం వండిన తర్వాత వచ్చిన గంజిలో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకుని తీసుకునే వాళ్ళు అందుకే దృఢంగా ఆరోగ్యంగా ఉండే వాళ్ళు మన పెద్దలు.
ఇక గంజి వల్ల ఎలాంటి లాభాలు ని పొందచ్చనే విషయాన్నికి వస్తే గంజిలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి అందుకే గంజి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. జీర్ణక్రియని ఇది మెరుగుపరుస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం గంజి లో స్టార్చ్ ఉంటుంది జీర్ణ సమస్యలను ఇది తొలగించగలదు.
అతిసారం కడుపునొప్పి వంటి జీర్ణ సమస్యలని ఇది పోగొడుతుంది. గంజి లోని పిండి పదార్థం బైండింగ్ ఏజెంట్ లాగ పనిచేస్తుంది అసౌకర్యముని కూడా తగ్గిస్తుంది. గట్ హెల్త్ ని ప్రోత్సహిస్తుంది. గంజి తీసుకుంటే హైడ్రేట్ గా కూడా ఉండొచ్చు. శరీరంలో కోల్పోయిన ద్రవాలు కణజాలం ఇది పునరుద్దించగలదు. రోగ నిరోధక శక్తి ని కూడా మనం గంజి ద్వారా పెంపొందించుకోవచ్చు గంజిని తీసుకుంటే నెలసరి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది బరువు తగ్గడానికి కూడా గంజి బాగా ఉపయోగపడుతుంది.