శివాని కేసులో ట్విస్ట్‌..చనిపోవడానికి ముందు భర్త మాటలు వైరల్

-

శివాని కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య కేసులో బయటికి వచ్చిన వీడియో వైరల్ అవుతుంది. భార్య చంపడానికి ముందు ఆమె గురించి భర్త గొప్పగా చెప్పారు. ‘నా భార్య తెలివైంది. చదువు తక్కువే కానీ గైడెన్స్ ఇస్తే ఏదైనా సాధించగలదు.

నా లైఫ్, వైఫ్ ధైర్యవంతురాలు. నేను ఉన్నంతవరకు ఆ ధైర్యాన్ని చూపిస్తుంది. నేనెప్పుడూ ఉంటానో, పోతానో తెలియదు. దేవుడు కరుణిస్తే దాంతో వందేళ్లు బతుకుతా…. లేదంటే మధ్యలోనే వెళ్లిపోతా’ అని పేర్కొన్నారు.

కాగా, ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన శివాని కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. విశాఖలో సంచలనం రేపిన ఈ కేసులో భర్తను చంపాలని ముందే డిసైడ్ అయ్యి… ఆమె చాలా వీడియోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. భర్త రమేష్ చనిపోయిన తర్వాత పోలీసులు అడగకుండానే వారికి వీడియోలు చూపించి…తామెంతో అన్యోన్యంగా ఉన్నట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. ఇదే పోలీసులకు ఆమెపై అనుమానం రావడానికి కారణమైనట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news