క్రెడిట్‌ కార్డు వాడే వారికి శుభవార్త.. ఇకపై మీ క్రెడిట్‌ కార్డును కూడా పోర్ట్‌ పెట్టుకోవచ్చు

-

చాలా మంది క్రెడిట్‌ కార్డు అంటే వామ్మో ఇది ఉంటే డబ్బులు అన్నీ బిల్లులు కట్టడానికే అయిపోతాయి అని తెగ కంగారుపడుతుంటారు. క్రెడిట్‌ కార్డున్‌ కరెక్ట్‌గా వాడటం తెలిస్తే మీ అంత తెలివైన వాళ్లు ఇంకెవరూ ఉండరు తెలుసా..? మీకు అది కొనక తప్పదు.. ఇవ్వాల కాకపోతే రెండు నెలల తర్వాత అయినా ఒక వస్తువు కొనాల్సిందే.. అలాంటప్పుడు మీకు క్రెడిట్‌ కార్డుబాగా ఉపయోగపడుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. మన అత్యవసరాలకు డబ్బు అడ్డుకాదు అనకుండా మనసుకు నచ్చినవి అప్పటకప్పుడే తీసుకోవచ్చు. బిల్‌ డేట్‌, పేమెంట్‌ డేట్‌ను కరెక్టుగా మేనేజ్‌ చేసుకుంటే చాలు.

అయితే షాపింగ్‌కు కూడా డబ్బురూపేణా క్రెడిట్‌ కారులో డబ్బు తీయాలంటే..జనాలంతా ఫాలో అయ్యేది క్రెడ్, నో బ్రోకర్‌, హౌసింగ్‌ లాంటి యాప్స్‌. ఈ థార్డ్‌ పార్టీ యాప్స్‌ మొదట్లో పదివేలకు వంద ఛార్జ్‌చేసేవి. కానీ ఇప్పుడు ఛార్జెస్‌ బాగా పెంచేశాయి. దీంతో మనకు కాస్త ఇబ్బందే అవుతుంది. ఈ ఇబ్బందులు లేకుండా క్రెడిట్‌ కార్డును కూడా యూపీఐకు లింక్ చేసే ఆప్షన్‌ను తీసుకొచ్చింది క్రేందం. దీంతో హ్యాపీగా డెబిట్‌ కార్డును వాడినట్లే వాడొచ్చు. అయితే మీ దగ్గర ఇప్పటికే వేరే క్రెడిట్‌ కార్డులు అంటే వీసా, మాస్టర్‌ లాంటివి ఉంటే వాటిని రూపేలోకి మార్చుకోవచ్చు తెలుసా..?

నచ్చిన కార్డ్ నెట్‌వర్క్‌కు మారే వెసులుబాటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అందించనుంది. అక్టోబర్‌ 1 నుంచి కస్టమర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. డెబిట్‌/క్రెడిట్‌/ ప్రీపెయిడ్‌ కార్డుల విషయంలోనూ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. వినియోగదారుడు తనకు నచ్చిన పేమెంట్‌ నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు. మాస్టర్‌ నుంచి రూపేకు, వీసా నుంచి మాస్టర్‌కు.. ఇలా మీకు నచ్చిన కార్డు నెట్‌వర్క్‌కు మారేందుకు ఆర్‌బీఐ వెసులుబాటు కల్పిస్తోంది. క్రెడిట్‌/డెబిట్‌/ప్రీపెయిడ్‌ కార్డ్‌ కస్టమర్లకు ఈ సౌకర్యం అక్టోబర్‌ 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) సన్నాహాలు చేస్తోంది.

మన దేశంలో వీసా (Visa), మాస్టర్‌ కార్డ్‌ (MasterCard), రూపే (RuPay), అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ (American Express), డైనర్స్‌ క్లబ్‌ (Diners Club) సంస్థ కార్డు నెట్‌వర్క్‌ సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థలు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీని ప్రకారం.. వినియోగదారుడికి ఏ కార్డు జారీ చేయాలన్నది సదరు కార్డు జారీ సంస్థదే నిర్ణయం. ఇకపై ఈ విషయంలో వినియోగదారుడిదే అంతిమ నిర్ణయం కానుంది. అంటే వీసా కార్డ్‌ ఉన్న వారు మాస్టర్‌ కార్డ్‌, రూపే లేదా మరేదైనా నెట్‌వర్క్‌కు మారాలనుకుంటే ఇకపై మారొచ్చు. దీనికి సంబంధించి ఆర్‌బీఐ తన తాజా ముసాయిదా సర్క్యులర్‌ జారీ చేసింది. దీనిపై ప్రస్తుతం అభిప్రాయాలు కోరుతోంది. అక్టోబర్‌ 1 నుంచి ఈ సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సన్నద్ధం అవుతోంది. ముసాయిదా ప్రకారం..

కార్డ్‌ జారీచేసే వారు ఆయా సంస్థలతో ముందస్తు ఒప్పందాలు చేసుకొని వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌ల సేవలను పొందకుడా నిరోధించకూడదు.

కార్డ్ జారీచేసే సంస్థ ఒకటి కంటే ఎక్కువ ఫైనాన్షియల్‌ నెట్‌వర్క్‌లతో సంబంధాలు పెట్టుకోవాలి. వాటికి సంబంధించిన కార్డులు జారీ చేయాలి.

అర్హులైన కస్టమర్లకు కార్డ్‌ను ఎంచుకొనే వెసులుబాటును కల్పించాలి. ఎప్పుడైనా పోర్ట్‌ చేసుకొనే అవకాశం ఉండాలి.

ఇది వరకే క్రెడిట్ కార్డ్‌/ డెబిట్‌ కార్డు తీసుకున్న వారు కొత్త కార్డు నెట్‌వర్క్‌కు మారొచ్చు. రెన్యువల్‌ సమయంలో కార్డు నెట్‌వర్క్‌ను మార్చమని బ్యాంకులను లేదా ఆర్థిక సంస్థలను కోరొచ్చు.

కొత్తగా కార్డు తీసుకునే వారు సైతం ఫలానా నెట్‌వర్క్‌ కార్డు కావాలని అడగొచ్చు.

తాజా ప్రతిపాదనతో కస్టమర్లు తమకు నచ్చిన కార్డు నెట్‌వర్క్‌ను ఎంచుకొనే వెసులుబాటు లభించనుంది.

రూపే క్రెడిట్‌ కార్డును యూపీఐతో లింక్‌ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి వచ్చిన వేళ ఈ నిర్ణయంతో చాలా మందికి ఊరట ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news