సాధారణంగా మనం ఏదైనా విషయాన్ని ఇతరులతో పంచుకుంటే బాధ అంతా కూడా పోతుందని ఎవరికైనా చెబుతూ ఉంటాము. స్నేహితులతో కూడా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. కష్ట సుఖాలను స్నేహితులతో పంచుకుని చాలామంది ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే అసలు ఫ్రెండ్స్ కి ఈ విషయాలని ఎప్పుడు కూడా చెప్పకూడదట ఈ విషయాలను స్నేహితులకి చెప్తే అది మీకే ప్రమాదం. ఎవరి కలలు వారికి ఉంటాయి అందరికీ వాళ్ళ కంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి.
అవి పర్సనల్ అవ్వచ్చు ప్రొఫెషనల్ అవ్వచ్చు వాటిని ఎప్పుడు కూడా ఇతరులకి చెప్పుకోకూడదు. మీ బలహీనత గురించి కూడా మీరు మీ ఫ్రెండ్స్ తో చెప్పుకోకూడదు చెప్పాల్సిన పని కూడా లేదు. మీ బలహీనత ఇతరులకి తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. మ్యారేజ్ రిలేషన్ షిప్ లో ఉండే రహస్యాలని కూడా ఇతరులతో చెప్పుకోకూడదు మీకు సంబంధించిన ప్రైవేట్ విషయాలని మీరు స్నేహితులకి చెప్పుకోకుండా ఉండడమే మంచిది.
డబ్బులకి సంబంధించిన విషయాలను కూడా మీరు పంచుకోకూడదు మీ ఆస్తి వివరాలు మీ జీతం గురించి మీ డబ్బుల గురించి ఇతరులకి చెప్పుకోకుండా ఉండడమే మంచిది. వీటిని చెప్పుకోవడం వలన ఉపయోగం లేదు. పైగా వాళ్లకి తెలియాక్కర్లేదు దీని వల్ల మీకే నష్టం ఇలాంటివి చెప్పుకోవడం వలన మీకే ముప్పు కలుగుతుంది కాబట్టి ఇటువంటి విషయాలని ఎవరికీ కూడా చెప్పుకోకుండా ఉండడమే మంచిది దాని వలన మీకే మంచి జరుగుతుంది ఏ బాధ ఉండదు.