BREAKING : ఒకే నియోజకవర్గంలో సీఎం జగన్, చంద్రబాబు పర్యటన

-

ఏపీ రాజకీయాల్లోకి కీలక పరిణామం ఎదురైంది.సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఒకే నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పోలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న కూనవరం మండలంలో సీఎం జగన్ వరద బాధితులను పరామర్శించనున్నారు.

అలాగే చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు వెళ్లనున్నారు. మరోవైపు రాత్రికి ఇరువురు నేతలు రాజమండ్రిలో బసచేయనుండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, నేడు,రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధిత గ్రామాల ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఏఎస్‌ఆర్‌ జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట కు ఉదయం 10.25 కు చేరుకుంటారు. ఇక్కడ గోదావరి వరదల ప్రభావిత ప్రాంతాలు, సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడిన అనంతరం కూనవరం బస్‌స్టాండ్‌ సెంటర్‌లో కూనవరం, వీఆర్‌ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news