65 సీట్లు గెలిస్తే కేంద్రంలో కీలకపాత్ర : సీఎం కేసీఆర్

-

65 సీట్లు గెలిస్తే కేంద్రంలో బీఆర్‌ఎస్‌ దే కీలక పాత్ర అన్నారు సీఎం కేసీఆర్. మహారాష్ట్రలో 48, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు కలుపుకొని 65 సీట్లలో BRS విజయం సాధిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్ లు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… మహారాష్ట్రలో లభిస్తున్న ఆదరణను చూస్తుంటే వందకు వందశాతం అక్కడ బీఆర్ఎస్ సర్కారు ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. నేను మహారాష్ట్రలో కాలు పెట్టాక విద్యుత్ కోతలు ఎత్తేసారని తెలిపారు సీఎం కేసీఆర్. మహారాష్ట్ర గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా వింతగా అనిపిస్తుంటుంది. దేశ ఆర్థిక రాజధానిగా ఖ్యాతిగాంచిని ముంబాయి తో పాటు మరెన్నో పెద్ద పెద్ద నగరాలు,పరిశ్రమలు, సహజవనరులు కలిగిన మహారాష్ట్రలో సంపదకు కొదువ లేదు. ఎన్నో నదులు మహారాష్ట్రలో పుడుతున్నాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news