వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలలో మెగాస్టార్ చిరంజీవి వైసీపీ ప్రభుత్వ విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అధికార వైసీపీని బలంగా తాకాయి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడ్డారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం పై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం.. సినిమా కలెక్షన్లపై దృష్టి పెట్టిందన్నారు. డిమాండ్ ఉన్నవారికి పారితోషికం ఎక్కువే ఇస్తారని కూడా అన్నారు.
దీంతో చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎదురు దాడికి దిగారు. చిరు వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. సినీ ఇండస్ట్రీలో చాలామంది పకోడీగాళ్లు ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎలా ఉండాలో వారు సలహా ఇస్తున్నారని.. ఆ సలహాలు వారు తన వాళ్ళకు ఇచ్చుకోవచ్చు కదా..? అని సూచించారు. రాజకీయాలు ఎందుకు..? డాన్సులు, ఫైట్స్, యాక్షన్ గురించి మనం చూసుకుందామని తన వాళ్లకి చెప్పొచ్చు కదా..? అని ఘాటు విమర్శలు చేశారు