పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీ 100 కోట్లు అయితే కలెక్ట్ చేసింది… కానీ వివాదాలు కూడా అంతే స్థాయిలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వివాదం వలన మొత్తం సీన్ అంతా కూడా మెగా బ్రదర్స్ వర్సస్ ఏపీ ప్రభుత్వం గా మారిపోయింది. ముందుగా అంబటి రాంబాబు నన్ను ఉద్దేశించి సినిమాలో పృథ్వి చేత డ్యాన్స్ లు వేయించారు అన్న దగ్గర నుండి మొదలు కాగా, ఈ విషయంపై పవన్ కళ్యాణ్ , నాగబాబు మరియు చిరంజీవి లు ముగ్గురూ కూడా ఈ వివాదంపై మాట్లాడారు. ఇక తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నాయకులు వరుసగా కౌంటర్ లు ఇస్తున్నారు. ముందు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాజకీయాలను తీసుకువచ్చాడు అంటూ మీ తమ్ముడిని అదుపులో పెట్టుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనితో ఒక్కసారిగా వివాదం మొత్తం చిరంజీవి అండ్ బ్రదర్స్ వెర్సస్ ఏపీ ప్రభుత్వం గా ఉంది.
ఇప్పుడు చిరంజీవి పైన చేస్తున్న ఈ వ్యాఖ్యలకు అటు నాగబాబు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ ఏమైనా స్పందిస్తారా ? సీన్ ఎలా ఉండనుంది అన్నది తెలియాల్సి ఉంది.