జూనియర్ ఎన్టీఆర్ పనిమీద ఎంత డెడికేటెడ్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరసం లేదు. ఒక సినిమా చిత్రీకరణలో ఉండగా ఎటువంటి విషయాల పైన తన ఫోకస్ పెట్టడు. సినిమా పూర్తయ్యే వరకు ఇంకా ఏమి చేయగలను అన్న ఆత్రుతతోనే నటుడిగా సంపూర్ణంగా జీవిస్తాడు. ఇక తాకగా కొరటాల శివ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం దేవర. ఇందులో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన నటించనుంది. ఇంకా పాత్ర డిమాండ్ మేరకు ఒక కీలకమైన పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ ను నటింపచేయాలన్నది మూవీ యూనిట్ ప్లాన్. ఇందుకోసం సదరు సీనియర్ హీరోయిన్ ను కూడా ఇప్పటికే డైరెక్టర్ టీం వెళ్లి కలిశారట, కథను కూడా ఆమెకు నారేట్ చేశారట. ఇంకా తెలిసిన సమాచారం మేరకు ఇది వరకే ఆమె ఎన్టీఆర్ సినిమాలో నటించిందని క్లూ కూడా ఉంది.
అయితే ఆమె ఒకపట్టాన ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. మరి ఎలా మూవీ టీం ఆమెను ఒప్పించి దేవర సినిమాలో నటింపచేస్తారో చూడాలి.