సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోలు, హీరోయిన్ల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అందులో నిజం ఉన్నా? లేకపోయినా? ఆ వార్తలు మాత్రం బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా హీరో విశాల్ పెళ్లి అంటూ ఈమధ్య వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతే కాదు ఒక ప్రముఖ హీరోయిన్ తో ఆయన ప్రేమలో ఉన్నారంటూ.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జోరుగా సాగింది. అభిమానులు కూడా ఇది నిజం అనే నమ్మారు. కానీ ఎట్టకేలకు ఈ వార్తలపై హీరో విశాల్ టీం స్పందించింది.
ప్రస్తుతం హీరో విశాల్ వయసు 40 సంవత్సరాలు.. అందుకే ఆయన పెళ్లి వార్తలపై నిత్యం మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుంది. గతంలో కూడా విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు రాగా.. వీరిద్దరూ చివరికి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా లక్ష్మీ మీనన్ తో ప్రేమలో పడ్డారని.. ఆమె వయసు 27 ఏళ్ళని.. విశాల్ తో ఆమె కూడా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తమిళ సినీ పరిశ్రమ షేక్ అయ్యే విధంగా కోలీవుడ్లో వీరి వివాహం జరగబోతోంది అని కూడా వార్తలు కోడై కూశాయి.
దీంతో విశాల్ టీమ్ స్పందిస్తూ.. అసలు ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు.. హీరో విశాల్ ఒక నటితో డేటింగ్ లో ఉన్నారు.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా ఊహాగానాలు మాత్రమే.. ఇందులో ఏ మాత్రం నిజం లేదు అంటూ విశాల్ టీమ్ స్పందించింది. అంతేకాదు విశాల్ గురించి వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదు అని, ఒకవేళ ఏదైనా నిజం ఉంటే తామే తెలియజేస్తామని చెబుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం మార్క్ ఆంథోనీ చిత్రంలో నటిస్తున్న విశాల్ ఈ సినిమాను వినాయక పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు..