వానాకాలంలో ఆస్తమా వున్నవాళ్లు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!

-

చాలామంది ఆస్తమా తో బాధపడుతూ ఉంటారు. ఆస్తమా సమస్యలు ఉన్నవాళ్లు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎప్పుడు కంటే వానా కాలంలో ఆస్తమా పేషెంట్స్ ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అనవసరంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆస్తమా పేషెంట్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. వాతావరణ సూచనలు ట్రాక్ చేసుకోండి. ఆస్తమా లక్షణాలని ట్రిగ్గర్ చేసే ఏమైనా పరిస్థితులు ఎదురవుతున్నాయో లేదో తెలుసుకోండి.

మీ పనులని దానికి తగ్గట్టుగా మీరు చేసుకోవడం మంచిది. తేమ కారణంగా ఫంగస్ బూజు పెరిగే అవకాశం ఉంటుంది ఆస్తమా లక్షణాలని ట్రిగ్గర్ చేసే ఒక ప్రధాన కారణం ఇది. ఆఫీస్ ఇల్లు పొడిగా ఉండేలా చూసుకోవాలి. బాగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. నియంత్రించడానికి డిహ్యుమిడిఫైయర్ని ఉపయోగించడం మంచిది. దుమ్ము లాంటివి ఇంట్లో లేకుండా చూసుకోవాలి.

ఇలా క్లీన్ చేసుకుంటే కూడా ఆస్తమా పేషంట్లకి బాగుంటుంది వర్షం వచ్చినప్పుడు తలుపులు ని కిటికీలని క్లోజ్ చేసేయండి లేదంటే ఆస్తమా పేషెంట్లకు ఇబ్బందిగా ఉంటుంది. నిలిచి ఉన్న నీటి దగ్గరికి వెళ్ళకండి నిలిచిపోయిన నీళ్ల దగ్గర నాచు వంటివి వృద్ధి చెందుతూ ఉంటాయి అలాంటి చోటకి వెళ్లడం వలన మీకు ఇబ్బంది మరింత కలగొచ్చు. తేమ స్థాయిలని నియంత్రించండి. పెంపుడు జంతువులు జుట్టు వంటి వాటి వలన కూడా ఇబ్బంది కలిగించవచ్చు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news