చంద్రబాబు – పవన్ కళ్యాణ్ పెద్ద సైకోలు: ఎమ్మెల్యే కాటసాని

-

కర్నూలు: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద సైకోలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు రాజకీయకులను చీదరించుకునేలా చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

 

పవన్ కళ్యాణ్ కు చైతనైతే గడప గడపకు రా.. వాలంటీర్ల సేవ ఎంటో తెలుస్తుందని సవాల్ విసిరారు. వాలంటీర్ వ్యవస్థతో జగన్ కు మంచి పేరు వస్తుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి భయం పట్టుకుందన్నారు. సినిమా డైలాగులు నిజ జీవితంలో పనికిరావని హితవు పలికారు కాటసాని. తోలు తీస్తే ఎదుటివాళ్ళు ఊరికే ఉంటారా..? అని మండిపడ్డారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు దోచుకుంటే ఏమ్ చేశావ్ పవన్ కళ్యాణ్..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news