Youtuber Anvesh: ప్రపంచాన్ని చుట్టేస్తున్న యూట్యూబర్‌.. నెలకు సంపాదన ఎంతో తెలుసా..?

-

సోషల్‌ మీడియా ద్వారా ఎంతో మంది డబ్బు సంపాదిస్తున్నారు. ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది సోషల్‌ మీడియా. మనలో ఏదైనా టాలెంట్‌ ఉందంటే చాలు.. మీరు ప్రపంచానికి ఎంత దూరంలో ఉన్నా సరే మిమ్మల్ని పరిచయం చేస్తుంది. మీ అందరికీ ఇతను తెలిసే ఉంటుంది. వైజాగ్‌కు చెందిన ఈ యువకుడు యూట్యూబర్‌గా మారి ప్రపంచాన్ని ఇట్టే చుట్టేసి వస్తున్నాడు. యూట్యూబ్ నుంచి కళ్లు చెదిరే ఆదాయాన్ని అందుకుంటున్నాడు.

ఎవరు ఈ అన్వేష్?

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన యువకుడే ఈ అన్వేష్. మొదటి నుంచి విదేశాల్లో తిరగడం అంటే చాలా ఇష్టం. అందుకే, ట్రావెలింగ్ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. 2019లో ‘నా అన్వేషణ’ అనే ఓ యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రపంచం మీద దండయాత్ర చేయడం మొదలు పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటి వరకు ఏకంగా 85 దేశాలు తిరిగాడు. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. తను చూడటమే కాదు, తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఇక్కడి వాళ్లకు అక్కడి విశేషాలను చూపిస్తూ, చక్కటి వాక్‌ చాతూర్యంతో అందర్ని ఆకట్టుకుంటాడు. ప్రస్తుతం అతడి యూట్యూబ్ చానెల్‌కు 1.39 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అన్వేష్ షేర్ చేసే వీడియోల కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తారంటే ఆశ్చర్యం కలగకమానదు.

కిలిమంజారో పర్వతారోహనణతో పాపులర్

అన్వేష్ బాగా పాపులర్ కావడంలో కిలిమంజారో పర్వతారోహణ వీడియో బాగా ఫేమస్‌ అయింది. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వతాన్ని ఆయన విజయవంతంగా అధిరోహించాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరానికి చేరుకున్నారు. ఆ తర్వాత భారతీయ జెండాను ఎగురవేసి, ‘జై జవాన్ జై కిసాన్’, ‘వందేమాతరం’తో పాటు ‘జనగనమణ’ గీతాలను ఆలపించాడు. ఈ వీడియో నెట్టింట్లో బాగా పాపులర్ కావడంతో పాటు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు పెరిగారు.

అప్పటి నుంచి ప్రపంచ యాత్రను మరింత స్పీడప్ చేశాడు. భారత పరిసర దేశాలతో పాటు సుదూర ప్రాంతాల్లోనూ పర్యటించారు. నార్త్ కొరియా లాంటి ప్రమాదకర దేశాల్లోనూ అడుగు పెట్టాడు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా , అమెరికా, ఐరోపా దేశాల్లో తిరిగి వచ్చాడు. ఇప్పటి వరకు ప్రపంచంలోని సగానికి పైగా దేశాల్లో అతడు పర్యటించాడు. తన యూట్యూబ్ ద్వారా ఎంతో మందికి ఆయా దేశాల్లోని విశేషాలను చూపించాడు.

యూట్యూబ్ నుంచి భారీగా సంపాదన

ప్రపంచ పర్యటనల ద్వారా ఆయా దేశాల్లోని వింతలు విశేషాలు తెలుసుకోవడంతో పాటు ఆన్వేష్ ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టి భారీగా ఆదాయాన్ని పొందుతున్నాడు. ప్రస్తుతం నెలకు సుమారు రూ. 60 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడంటే ఆయన రేంజి ఏంటో మీరే అర్థం చేసుకోండి. వాస్తవానికి పాపులర్ టీవీ చానెళ్లు కూడా ఇంత మొత్తం సంపాదించలేవు. కానీ అన్వేష్ ఎంజాయ్ చేస్తూ ఈజీగా సంపాదించేస్తున్నాడు. తెలుగులోని పలువురు యూట్యూబర్లతో పోల్చితే తక్కువ సబ్ స్ర్కైబర్లు ఉన్నా ఆదాయంలో మాత్రం దుమ్మురేపుతున్నాడు. తాజాగా చైనాలో పర్యటించిన ఆయన అక్కడి విశేషాలను ప్రజల ముందు ఉంచాడు. ఈ వీడియోలకు ఊహించని రేంజిలో వ్యూస్ రావడంతో భారీగా ఆదాయం లభించింది. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా అతడి నెల ఆదాయం రూ. 60 లక్షలకు కాస్త అటు ఇటుగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news