సైనికుల బస్సుపై ముష్కరుల దాడి.. 20 మందికి పైగా మృతి

-

సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై ముష్కరులు దాడి చేసిన ఘటనలో 20 మందికి పైగా సైనికులు దుర్మరణం చెందారు. ఈ ఘటన లెబనాన్ రాజధాని బేరూట్​లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. అయితే వీరంతా సిరియా సైనికులను తెలిసింది. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు. ఉగ్రసంస్థ ఐఎస్​ఐఎస్ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

బ్రిటన్​ కేంద్రంగా పనిచేస్తున్న సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ.. ఈ ఘటనలో 23 మంది సిరియా సైనికులు మరణించారని, 10 మంది గాయపడ్డారని తెలిపింది. మరోవైపు, తూర్పు సిరియాకు చెందిన వ్యక్తి.. ఈ దాడిలో 20 మంది సైనికులు మరణించారని తెలిపారు.

ఐఎస్​ఐఎస్​ ఆధీనం నుంచి 2017లో ఇరాన్, 2019లో సిరియా బయటపడ్డాయి. అప్పటి నుంచి సిరియాలో వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా సిరియాపై ఐఎస్​ఐఎస్​ ఉగ్రసంస్థ దాడులకు పాల్పడుతోంది. అలాగే స్లీపర్ సెల్స్​తో దాడులు చేయిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో సెంట్రల్ టౌన్ సుఖ్నా సమీపంలో కార్మికులపై స్లీపర్ సెల్స్​తో దాడి జరిగిన ఘటనలో 53 మందిని చంపారు.

Read more RELATED
Recommended to you

Latest news