ఇలా చేయండి.. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది..!

-

ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట డబ్బు ఉండాలని కోరుకుంటారు. డబ్బు ఉంటే లోటే ఉండదు డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి కొంతమంది డబ్బుల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఎన్నో తిప్పలు పడుతుంటారు. డబ్బులు మన ఇంట ఉండాలంటే ఇలా చేయండి ఇక ఇలా చేశారంటే ఇక మీ ఇంట్లో సంపదకు లోటు ఉండదు. శుక్రవారం నాడు ఉప్పుని తెచ్చుకోండి శుక్రవారం నాడు ఉప్పుని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట ఉంటుంది.

పాలని కాచినప్పుడు ఒక్కోసారి అవి పొంగిపోతూ ఉంటాయి అవి పొంగిపోవడం శుభమే కానీ అవి వృధాగా నేల మీద పడిపోకూడదు. పాలు పాడైపోతే వెంటనే వాటిని ఇంటి నుండి తొలగించాలి పాడైపోయిన పాలని ఇంట్లో పెట్టుకుంటే కూడా అసలు మంచిది కాదు. చెడిపోయిన పాలు ని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అక్కడ ఉండదట.

పాలని మీరు పోసేటప్పుడు శుభ్రమైన గిన్నెలో మాత్రమే పాలని పోయాలి. పాలని శుభ్రంగా లేని గిన్నెలో పోసినట్లయితే లక్ష్మీదేవి దూరమవుతుంది. ఈ తప్పు చేయడం వలన అప్పులు బాధలు కూడా బాగా పెరుగుతాయిట. శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. శుక్రవారం ఎవరైనా ముత్తైదువు ఇంటికి వస్తే దక్షిణతో కూడిన తాంబూలం ఇస్తే లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుంది. డబ్బులకి లోటు ఉండదు ఆర్థిక బాధల నుండి కూడా బయటపడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news