అతి త్వరలో అమృత్ ఫలాలు అందుతాయని పేర్కొన్నారు మంత్రి విడదల రజిని చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి లో ముందంజలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని మంత్రి విడదల రజిని తెలిపారు. చిలకలూరిపేటలోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో నియోజకవర్గ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ లతోటి శివశంకర్ గారు, జేసీ శ్యాంప్రసాద్ గారు, ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ గారు,అన్ని శాఖల ప్రాజెక్ట్ డైరెక్టర్లు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ గతంలో చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి రాజీ లేకుండా పనిచేస్తున్నామని చెప్పారు. గతంలో చిలకలూరిపేట ఎలా ఉంది..? తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గం ఎలా ఉంది.. అనే విషయాలను పరిశీలిస్తేనే తాము ఏ స్థాయిలో అభివృద్ధి చేశామో అర్థమైపోతుందని పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణ ప్రజలకు అతి త్వరలో అమృత్ పథకం ఫలాలు అందజేస్తామని చెప్పారు. ఈ నెలాఖరులోగా అమృత్ పథకాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ ఎస్పీ కెనాల్ నుంచి మంచినీటి చెరువుకు వేస్తున్న పైపులైను పనుల్లో ఒక 29 కిలోమీటర్లకు వరకు పెండింగ్ ఉందని, ఆ పనులు మినహా మిగిలిన అన్ని పనులు ఈ నెలాఖరులోగా పూర్తికావాలని స్పష్టం చేశారు. ఆ 29 కిలోమీటర్ల పైపులైను పనులు కూడా డిసెంబరునాటికి పూర్తికావాలని ఆదేశించారు. అమృత్ పథకం చిలకలూరిపేట ప్రజల చిరకాల స్వప్నం అని చెప్పారు.