వెస్ట్ ఇండీస్ మరియు ఇండియా ల మధ్య జరుగుతున్న నాలుగవ టీ20 మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.. పైగా జట్టులో భారీగా మూడు మార్పులు చేయడం విశేషం.. ఎలాగైనా గెలవాలన్న కసితో వరుసగా విఫలం అవుతున్న ఝాన్సన్ చార్లెస్, రోస్టన్ చేస్ మరియు జోసెఫ్ లకు బదులుగా షై హోప్, జాసన్ హోల్డర్ మరియు ఒడియన్ స్మిత్ లకు అవకాశాన్ని ఇచ్చింది. ఇక ఇండియా మాత్రం గత మ్యాచ్ లో గెలిచిన జట్టునే కొనసాగించింది. ఇక మొదట బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్ ఇండీస్ దూకుడే మంత్రంగా ఆడుతూ ఉంది. ఇక ఈ మ్యాచ్ లో విండీస్ కనుక గెలిస్తే సిరీస్ ను గెలుచుకుంటుంది .. ఇదే సమయంలో ఇండియా పరువు మొత్తం పోతుంది. మరి ఇంతటి దారుణమైన స్థితిని ఇండియా కొని తెచ్చుకుంటుందా అన్నది తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు ఆగాల్సిందే.
కాగా ఈ పిచ్ పై వెస్ట్ ఇండీస్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేయాల్సి ఉంది. ఎందుకంటే వెస్ట్ ఇండీస్ కు బౌలింగ్ దళం భారీగానే ఉంది. మరి చూద్దాం ఏమి జరగనుంది అన్నది తెలియాల్సి ఉంది.