గ్రూప్ 2 పరీక్షకు వారం రోజుల ముందు నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29, 30న గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే, అభ్యర్థుల డిమాండ్ తో పరీక్షను వాయిదా వేసింది టీఎస్ పీఎస్ సీ. టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలను ప్రభుత్వం నవంబర్ కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీషెడ్యూల్ చేసిన తేదీలను టీఎస్పీఎస్సీ ఆదివారం(ఆగస్టు 13) సాయంత్రం విడుదల చేసింది. నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
జేఎల్, డీఎల్ పరీక్షలకు ప్రిపేర్ అయినవారు గ్రూప్ 2 కోసం మళ్లీ వేరే సిలబస్ చదవాల్సి వస్తున్నది. అయితే, వరుసగా నోటిఫికేషన్లు విడుదల కావడం, వరుసగా పరీక్షలు ఉండటంతో ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయం ఉండటం లేదు. దీంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసి ఆ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి తగిన సమయం అభ్యర్థులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.