ఏపీలో 1.82 లక్షల మంది ఎయిడ్స్ రోగులు.. దేశంలో ఏపీది ఎన్నో స్థానమంటే..?

-

హెచ్‌ఐవీ, ఎయిడ్స్ ఇప్పటికీ చాలా దేశాలను వణికిస్తోంది. ఇప్పటిదాకా 3.5కోట్ల మందికి పైగా ప్రాణాలను ఎయిడ్స్ వ్యాధి బలితీసుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులు అత్యధికంగా కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. డిసెంబరు 2018 నాటికి దేశవ్యాప్తంగా 12.73 లక్షల మంది హెచ్ఐవీ, ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్టు జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక పేర్కొంది.

వీరిలో ఏకంగా 1.82 లక్షల మంది ఏపీలోనే ఉండడం గమనార్హం. ఫలితంగా ఈ జాబితాలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 78 వేల మందితో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news