గత కొంతకాలంగా గరిష్ట స్థాయి నుంచి పతనమైన బంగారం ధరలు, తాజాగా అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలతో పసిడి పరుగులు తీయడం ప్రారంభించింది. ఈ రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర గురువారంతో పోలిస్తే 100 రూపాయల వరకూ పెరిగింది. కాగా, వెండి ధరలు కుడా అదేబాట పట్టాయి. గురువారం భారీగా పెరిగిన వెండి శుక్రవారం కూడా కేజీకి 50 రూపాయలు పెరిగింది. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది.
దీంతో పది గ్రాముల ధర 40,060 రూపాయలకు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. దీంతో 36,730 రూపాయల వద్దకు చీరుకుంది. ఇక వెండిధరలు కేజీకి 50 రూపాయలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,950 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,960రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,730 రూపాయలకు పెరిగాయి.