మళ్ళీ ఆ స్కీమ్ ని తెచ్చిన ఎస్బీఐ.. రూ.1 లక్ష కి ఎంతంటే..?

-

ఎన్నో స్కీమ్స్ ని తెచ్చింది స్టేట్ బ్యాంక్. అలానే అనేక సేవలని అందిస్తుంది. తాజాగా కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆగస్టు 15తో గడువు ముగిసిన స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్
గడువు ని పొడిగిస్తున్నట్టు బ్యాంకు చెప్పింది. మార్చి 31, 2023తో మాములుగా ముగిసిపోవాలి కానీ దానిని మరో 3 నెలలు అంటే ఆగస్టు 15 వరకు పొడిగించింది. ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేసారు. ఇక ఈ స్కీము మీద ఎంత వస్తుంది అనేది చూసేద్దాం.

ఈ స్కీమ్ లో రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే.. ఎంత వస్తుందో చూద్దాం. ఈసారి ఈ స్కీమ్ ని డిసెంబర్ 31 వరకు ఎక్స్టెండ్ చేసారు. సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం మేర వడ్డీ వస్తుంది. సాధారణ కస్టమర్లకు 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ లో మీరు రూ. 2 కోట్ల లోపు వరకు డిపాజిట్ చేసుకో వచ్చు. స్వల్ప కాలిక లక్ష్యంతో పొదుపు చేసే వారికి ఈ స్కీము బాగా ఉపయోగ పడుతుంది.

ఈ స్కీము ఫిక్స్‌డ్ డిపాజిట్ టెన్యూర్ 400 రోజులుగా వుంది. సాధారణ కస్టమర్ ఈ స్కీమ్‌లో రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే.. 7.10 వడ్డీ వర్తిస్తుంది. మెచ్యూరిటీ సమయానికి అదనంగా వార్షిక వడ్డీ రూ.7,100 వస్తాయి. మరో 35 రోజులకు ఈ అసలు, వడ్డీ కలిపి వడ్డీ లెక్కిస్తారు. మొత్తంగా రూ.7.500 వరకు వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్లు రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే.. 7.60 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయానికి ఎక్స్ట్రాగా రూ. 8 వేల వరకు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news