బెంగళూరు.. ఈ పేరు వినగానే ముందు మనకు గుర్తొచ్చేది ఐటీ. ఆ తర్వాత మైండ్ లో స్ట్రక్ అయ్యేది ట్రాఫిక్. ఈ నగరం ట్రాఫిక్ కష్టాల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ సమస్య కారణంగా నగరంలో క్యాబ్ సర్వీస్ ధరలు కూడా పెరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల మధ్య ఒక మహిళ కేవలం రూ. 6 లకే ఉబర్ రైడ్ సేవలను పొందారు. అదేంటని షాకవుతున్నారా.. అసలు సంగతేంటో తెలుసుకుందాం పదండి.
ఉబర్ రైడ్‌లో క్యాబ్ బుకింగ్ చేసే సమయంలో ఆమె ప్రమోషనల్ కోడ్‌ని ఎంటర్ చేయడం ద్వారా కేవలం రూ. 6 లకే సేవలను పొందగలిగారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ (ట్విటర్) వేదికగా పంచుకున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా యాడ్ చేశారు. అసలు ధర రూ. 46.24 కంటే ఇది ఎంతో తక్కువ. దీంతో నెటిజన్లు ఆశ్యర్యానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు 50 వేల మందికి పైగా వీక్షించారు. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
This has to be a bug pic.twitter.com/X2gyUCLLNU
— Mahima Chandak (@mahima_chandak) August 16, 2023