బెదిరింపులకు ఎవరూ భయపడొద్దు: పవన్‌

-

అట్రాసిటీ కేసులను వైసీపీ సర్కార్ అడ్డగోలుగా వాడుకుంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆరోపించారు. విశాఖలో వారాహి విజయయాత్రలో పాల్గొన్న పవన్ కల్యాణ్ జనవాని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ప్రజలతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే.. నిన్న పవన్ కళ్యాణ్ విశాఖపట్నం నుంచి భీమిలి వెళ్లే దారిలో ఉన్న ఎర్రమట్టి గుట్టలను పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితర నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో అధికార వైఎస్సార్సీపీ సహజ వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Pawan kalyan: జనసేన వస్తే దివ్యాంగులను గుండెల్లో పెట్టుకుంటాం: పవన్‌  కల్యాణ్‌ | pawan kalyan janavani in visakhapatnam

కరోనా సమయంలో వైసీపీ నేతలు భూములు కొల్లగొట్టారన్నారు. భూములు కోల్పోయిన బాధితులకు తాము అండగా ఉంటామని పవన్ కల్యాణ్ భారోసా ఇచ్చారు. బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని పవన్ కల్యాణ్ సూచించారు. అన్యాయం జరిగితే పోరాటం చేయాలి.. లేదంటే తిరగబడాలి అని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రను వైసీపీ నాయకులు అంచెలంచెలుగా విధ్వంసానికి పాల్పడుతున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...