నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం పేరు మార్పు.. కేంద్రంపై రాహుల్ ఫైర్

-

నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ పేరును మార్చడంపై కాంగ్రెస్‌ స్పందించింది.  మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు. ‘‘నెహ్రూ తాను చేసిన కృషితో ప్రసిద్ధి చెందారు. ఆయన పేరు వల్ల కాదు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియంకి కొత్తగా ప్రధానమంత్రి మ్యూజియం అండ్‌ లైబ్రరీగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నేతలు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీకి చాలా భయాలు, అభద్రతా భావాలు ఉన్నాయని.. తొలి ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేసిన నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేయడమే బీజేపీ అజెండాగా పెట్టుకుందని అన్నారు.

పేరు మార్చడంపై మరో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ కూడా రియాక్ట్ అయ్యారు. ఇతర ప్రధానులకు స్థానం కల్పించేందుకు భారత తొలి ప్రధాని పేరును తీసివేయడం చాలా చిన్న పని అని.. అయినా ఫర్వాలేదు, దీనిని నెహ్రూ మెమోరియల్‌ ప్రైమ్‌ మినిస్టర్స్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీగా పిలుచుకోవచ్చని  అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news