టిపిసిసి చీఫ్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ వ్యవహారం చర్చనియాంశంగా మారింది. గురువారం భద్రత సిబ్బంది విధుల నుంచి వెనక్కి వెళ్లిపోయారు. తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డికి ఎంపీ హోదాలో ఇప్పటివరకు 2+2 కేటగిరీని ఇచ్చింది. అయితే ఇద్దరు భద్రత సిబ్బంది స్థానంలో గురువారం ఉదయం ఒక్కరు మాత్రమే విధులకు హాజరయ్యారు. ఒక్కరే రావడంతో ఏం జరిగిందని రేవంత్ రెడ్డి గన్ మెన్ ని ఆరా తీశారు. 1+1 సెక్యూరిటీ కల్పించాలని ఉన్నతాధికారుల నుంచి తమకు ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు.
అయితే రేవంత్ రెడ్డికి ప్రభుత్వం భద్రతను తగ్గించడం పై ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. ఇది అప్రజాస్వామిక చర్య అని అన్నారు సీతక్క. వెంటనే రేవంత్ రెడ్డికి భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి రాజకీయాల కోసం ప్రలోభాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.