విక్రమ్ పంపిన జాబిల్లి తొలి ఫొటోలు షేర్‌ చేసిన ఇస్రో

-

చంద్రుడిపై పరిశోధనల కోసం నింగిలోకి దూసుకెళ్లిన ఇండియన్ రాకెట్ చంద్రయాన్-3 తన లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. చంద్రుడి కక్ష్యలో సొంతంగా పరిభ్రమిస్తున్న ల్యాండర్‌ విక్రమ్‌ .. జాబిల్లి ఉపరితలం ఫొటోలను తన కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను ఇస్రో ఎక్స్‌ (ట్విటర్) వేదికగా షేర్‌ చేసింది. ఆ ఫొటోలు మీరు కూడా చూసేయండి మరి.

చంద్రయాన్‌-3 వ్యోమనౌకలో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ గురువారం విడిపోయిన తర్వాత కొద్దిసేపటికే ఈ ఫొటోలను తీసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో జాబిల్లి ఉపరితలంపై బిలాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని చెప్పారు. ఫ్యాబ్రీ, గియార్డనో బ్రునో, హర్కేబి జే తదితర వాటి ఫొటోలను ల్యాండర్ తీసినట్లు వివరించారు. చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ల్యాండర్‌ మాడ్యూల్‌ జాబిల్లికి మరింత చేరువైంది. ఇవాళ సాయంత్రం చేపట్టిన డీబూస్టింగ్‌ (వేగాన్ని తగ్గించే) ప్రక్రియ విజయవంతమైనట్లు  ఇస్రో వెల్లడించింది. ల్యాండర్‌ (విక్రమ్‌), రోవర్‌ (ప్రజ్ఞాన్‌)తో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌ ఆరోగ్యంగానే ఉందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news