కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీములతో చాలా మందికి ప్రయోజనం ఉంటోంది. దేశ ప్రజల కోసం చాలా రకాల సంక్షేమ పథకాలను కేంద్రం తీసుకు వస్తూ ఉంటుంది. అయితే ఆసుపత్రి ఖర్చులు భరించే స్తోమత లేని పేద, మధ్య తరగతి ప్రజలు కి మేలు కలగాలని ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ని తెచ్చింది. దీనినే ఆయూష్మాన్ భారత్ యోజన అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఇది. దీని ద్వారా కోట్లాది మంది సామాన్య ప్రజలు కి ప్రయోజనం కలుగుతోంది.
ప్రతి ఏటా ఒక్కో కుటుంబం రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను అందిస్తోంది. ఈ స్కీము కోసం పేద, బడుగు బలహీన ఆదాయ వర్గాలకు చెందిన వాళ్ళు దరఖాస్తు చెయ్యవచ్చు. ఎస్సీ, ఎస్టీ, నిరుపేదలు, కార్మికులు ఈ స్కీమ్ బెనెఫిస్ కోసం అప్లై చేసుకోవచ్చు. PMJAY అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి అర్హులో కారో చూసుకోవచ్చు.
రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స సదుపాయం ని అర్హులు పొందవచ్చు. ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా 15 రోజులకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. మళ్ళీ డబ్బులేమీ కట్టక్కర్లేదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటోలు సబ్మిట్ చేయాలి. PMJAY అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోచ్చు.