జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్సన్‌ !

-

జియో యూజర్లకు గుడ్ న్యూస్. ఇక ఫ్రీగా నెట్​ఫ్లిక్స్ వాడుకునే అవకాశాన్ని మీరు పొందొచ్చట. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా..? మీ కోసమే.. నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు ప్రీ-పెయిడ్‌ మొబైల్‌ ప్లాన్లను రిలయన్స్‌ జియో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పటికే జియో పోస్ట్‌-పెయిడ్‌ ప్లాన్‌, జియో ఫైబర్‌ ప్లాన్ల ఎంపికపై వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తోంది. తాజా ఆఫర్‌తో ప్రీ-పెయిడ్‌ కస్టమర్లకూ నెట్‌ఫ్లిక్స్‌ వినోదం అందుతోంది.

జియో నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్ వివరాలు

  • 84 రోజుల వ్యవధితో జియో ప్రీ-పెయిడ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లు.. రూ.1,099, రూ.1,499 ధరల్లో లభ్యం
  • రూ.1,099 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌, అన్‌లిమిటెడ్‌ 5జీ డాటా లేదా రోజుకు 2జీబీ 4జీ డాటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ ఉంటాయి
  • రూ.1,499 ప్లాన్‌లో కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్‌ను ఒకేసారి అటు మొబైల్‌లో ఇటు టీవీల్లో చూడవచ్చు. అన్‌లిమిటెడ్‌ 5జీ డాటా లేదా 3జీబీ 4జీ డాటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ ఉంటాయి
  • నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్‌ను మొబైల్‌ ఫోన్లలో మాత్రమే చూసేలా విడిగా రూ.149తో నెలవారీ నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌
  • విడిగా రూ.199 రిచార్జ్‌తో నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ నెలవారీ ప్లాన్‌
  • 84 రోజుల కాలపరిమితితో అపరిమిత వాయిస్‌ కాల్స్‌ 2జీబీ డాటా ప్లాన్‌ ధర రూ.719, 3జీబీ డాటాతో రూ.999

Read more RELATED
Recommended to you

Latest news