మా అమ్మకు అందమైన వరుడు కావాలి… కూతురు సంచలనం…!

-

సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాల్లో విడ్డూరపు పాళ్ళు కాస్త ఎక్కువయ్యాయి అనేది వాస్తవం. రాజకీయాల మీద విడ్డూరంగా స్పంది౦చినట్టే తమ వ్యక్తిగత జీవితాలు, కుటుంబ సభ్యుల జీవితాల మీద కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. విదేశీ సంస్కృతి కూడా భారతీయుల్లో రోజు రోజుకి పెరిగిపోతుంది. విదేశాల్లో అనుసరించే కార్యక్రమాలను ఇక్కడ కూడా అనుసరిస్తూ కాస్త వింతగా కనపడే ప్రయత్నం చేస్తున్నారు. తమను వింతగా చూడాలి అనే తపన తో అందరికంటే రెండు అడుగులు ముందే నడుస్తున్నారు.

తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. సాధారణంగా తల్లి తండ్రులు ఒంటరిగా ఉంటె పిల్లలు… మన దేశంలో తమ వద్ద ఉంచుకోవడమో లేక వారికి అన్ని సదుపాయాలు ఇచ్చి వారానికో పది రోజులకో వెళ్లి చూసి రావడానికి మొగ్గు చూపిస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు అనుకునే వాళ్ళు అయితే… వారిని ఆశ్రమాల్లో చేర్చి చేతులు దులుపుకుంటూ ఉంటారు. అందరిలా తాను ఎందుకు చెయ్యాలి అనుకుందో ఏమో… ఒక యువతీ ఏకంగా తన తల్లికి సంబంధం వెతికే పనిలో పడింది. ఆస్తా వర్మా అనే యువతీ… అమ్మ తో పాటుగా ఉన్న తన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ..

మా అమ్మకు 50 ఏళ్ళ అందంగా ఉన్న వరుడు కావాలి. అయితే ఈ పెళ్లి కొన్ని షరతులు వర్తిస్తాయి అని ఒక సందేశం రాసింది. తన అమ్మకు కాబోయే భర్త శాకాహారిగా ఉండాలని, మద్యం సేవించరాదని, బాగా సెటిల్ అయిన వ్యక్తి అయ్యి, మంచివాడై ఉండాలని ఆమె ఆ ట్విట్ లో ఆమె స్పష్టంగా పేర్కొంది. ఈ ట్వీట్ పై ఎవరైనా స్పందించారో లేదో తెలియదు గాని ఆ అమ్మాయి చేసిన పని మెజారిటి నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. మీ అమ్మ ఒంటరి తనాన్ని ఇలా బజారు పాలు చేస్తావా అంటూ పలువురు నానా మాటలు అంటున్నారు. మరికొందరు అయితే ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news