వివాహ వేడుకలో ఫొటోగ్రాఫర్ డ్యాన్స్.. ఏం చేశాడు భయ్యా.. ఇరగదీశాడు

-

పెళ్లి వేడుకలో వధూవరుల తర్వాత అంత ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తి ఫొటోగ్రాఫర్. వివాహ వేడుకలో వధూవరుల తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉంటారో అంతకంటే బిజీగా ఫొటోగ్రాఫర్ ఉంటారు. ప్రతి మూమెంట్​ను క్యాప్చర్ చేస్తూ.. వారి స్పెషల్​ డే ను లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలా మెమొరీస్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఫొటోగ్రాఫర్స్. కానీ ఓ ఫొటోగ్రాఫర్ మాత్రం ఓవైపు ఫొటోలు తీస్తూనే మరోవైపు బంధువులతో కలిసి స్టెప్పులేశాడు. అదేంటి.. డ్యాన్స్ చేస్తూ ఫొటోలు, వీడియోలు తీయడమేంటని అనుకుంటున్నారా.. అదే మరి స్పెషాలిటీ..!

కెమెరాను వదలకుండా ఫ్లోర్‌పై అద్భుతంగా డ్యాన్స్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ ఫొటో గ్రాఫర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ మారింది. ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. అతడి డ్యాన్స్​కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘‘మీ డాన్స్‌ సూపర్ అంటూ ఒకరు.. ఏం చేశాడు భయ్యా.. డ్యాన్స్ ఇరగదీశాడు అంటూ ఇంకొకరు.. కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ ఫొటోగ్రాఫర్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news