ఆర్టీసీ x రోడ్ లో సినిమా కాదు… ప్రతిపక్షాలకు ఎన్నికల్లో సినిమా చూపిస్తాం – కేటీఆర్

-

ఆర్టీసీ x రోడ్ లో సినిమా కాదు… ప్రతిపక్షాలకు ఎన్నికల్లో సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌ వీఎస్టీ – ఇందిరాపార్క్‌ స్టీల్‌ బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. స్టీల్ బ్రిడ్జికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. లోయర్ ట్యాంక్ బండ్, అప్పర్ ట్యాంక్ బండ్ ను కలుపుతూ నిర్మాణాలు చేస్తామని.. ఇక్కడ ఇంటర్నేషనల్ టూరిస్ట్ స్పాట్ తయారు చేస్తామని ప్రకటించారు. విశ్వ నగరం గా ఎదగాలనే హైదరాబాద్ కు పునాది పడిందని వెల్లడించారు. కేంద్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న వాళ్ళు మతం పేరుతో చిచ్చు పెట్టడానికి వస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా చెసుకుందామని కోరారు. ఆర్టీసీ x రోడ్ లో సినిమా కాదు… ప్రతిపక్షాలకు రాబోయే ఎన్నికల్లో సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్‌ చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news