లద్ధాక్ టూర్​లో రాహుల్ గాంధీ.. స్టైలిష్ లుక్​లో బైక్ రైడింగ్

-

నిత్యం రాజకీయాలు.. విమర్శలు.. ప్రతివిమర్శలు.. ఎన్నికలు.. ప్రజాసేవ.. ఇలా క్షణం తీరికలేకుండా బిజీగా ఉండే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాస్త రిలాక్స్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే వేషధారణ మార్చారు. బైక్ అందుకుని అలా తన ఫేవరెట్ స్పాట్​కు రైడ్ చేసుకుంటూ వెళ్లారు. ఓ సాధారణ పౌరుడిలా తనకు దొరికిన కాస్త సమయాన్ని రిలాక్స్ అవ్వడానికి వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన లద్ధాక్ వెళ్లారు. ఇప్పుడు ఆ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ ఫొటోల్లో రాహుల్ గాంధీ న్యూలుక్​లో కనిపించారు. లద్ధాఖ్ పర్యటనలో ఉన్న ఆయన స్పోర్ట్స్​ బైక్​ను డ్రైవింగ్ చేస్తూ పాంగాంగ్ సరస్సుకు వెళ్లారు. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తూ.. ‘ప్రపంచంలో అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటని నా తండ్రి రాజీవ్ గాంధీ చెప్పేవారు’ అని క్యాప్షన్ జోడించారు. రాహుల్ బైక్ రైడ్ లుక్​పై ఆ పార్టీ కార్యకర్తలు, నెటిజన్లు.. సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news