నా వీడియోను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ, ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ తెలిపారు. అసలు విషయంలోకి వెళ్లితే టీవీ యాంకర్ అనసూయ ఏడుస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చుసిన నెటిజన్స్ అనసూయకు ఏమైంది? ఎందుకు అలా వెక్కి వెక్కి ఏడుస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. కొందరేమో తనపై వస్తున్న బ్యాడ్ కామెంట్స్ కు హార్ట్ అయివుంటుందని, అందుకే అలా ఏడ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.ఈ కామెంట్స్ అన్నీ అనసూయ వద్దకు చేరడంతో ఆమె మరో వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఎందుకు ఆడవాల్సి వచ్చింది అనేదానిపై క్లారిటీ ఇచ్చింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నేను ఏడ్చుకుంటూ షేర్ చేసిన వీడియో ను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు.
నాపై వస్తున్న ట్రోలింగ్ అండ్ బ్యాడ్ కామెంట్స్ కి హార్ట్ అయి నేను ఆలా ఏడ్చానని అనుకుంటున్నారు. కానీ నేను అందుకు ఏడవలేదు. ఆ సమయంలో నేనొక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. దానికి చాలా బాధేసింది. అందుకె నా భాదను మీతో పంచుకోవాలని ఆ వీడియో చేశాను. పక్కన నోట్ లో కూడా అది వివరించాను. ఆ నోట్ చదవలేదా. అయినా నాకేదైనా సమస్య వస్తే ఏడ్చే టైప్ కాదు నేను. కోపం తెచ్చుకునే టైప్. ఎలాగైనా ఎదిరించే టైప్. నా వీడియోను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.