మెదక్‌కు రైలును ఊహించలేదని, సీఎం కేసీఆర్ నిధులు ఇవ్వడంతోనే రైలు కల నెరవేరిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. మెదక్ జిల్లా అనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అని, సీఎం కేసీఆర్ అయ్యాకే మెదక్ జిల్లా కల నెరవేరిందన్నారు. కాంగ్రెస్ ఉంటే కలగానే ఉండేదని, కలలు కనడమే కాదు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది సీఎం కేసీఆరేనన్నారు. మన సంక్షేమ పథకాలు చెప్పినప్పుడు ఇతరులు ఆశ్చర్యపోయారని.. ఇందిరాగాంధీ మాట ఇచ్చి తప్పారని, జిల్లా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమన్నారు. మెదక్‌కు రైలును ఊహించలేదని, సీఎం కేసీఆర్ నిధులు ఇవ్వడంతోనే రైలు కల నెరవేరిందని చెప్పారు. మెదక్‌కు మెడికల్ కళాశాల వస్తదని కలలో కూడా అనుకోలేదని, మెదక్ పట్టణ రూపురేఖలు మారిపోయానన్నారు. 23న పండుగలాగా విజయవంతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత చెప్పాలన్నారు.
యావత్ మెదక్ జిల్లా ప్రజలు వచ్చి కృతజ్ఞతలు చెప్పి విజయవంతం చేయాలన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ఉంటుందని, ఈ సభ సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభ 9ఏండ్లలో ఇంత అభివృద్ధి జరగడం కేసీఆర్ విజన్ కేసీఆర్‌ను ఆశీర్వదించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. మూడోసారి సీఎం అయ్యేది కేసీఆరేనన్నారు. నాలుగు లక్షల ఎకరాల్లో పొడుపట్టాలు ఇచ్చామని, 1.50 లక్షల కుటుంబాలకు పోడు పట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు.కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరని, బీజేపీకి క్యాడర్ లేదని.. బీఆర్‌ఎస్‌కు తిరుగులేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని, 24 గంటల కరెంటు అంటే నమ్మలేదని, ఇచ్చి చూపించారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌ను తిట్టడంలో బిజీగా ఉంటే కేసీఆర్ వడ్లు పండించడంలో బిజీగా ఉన్నారన్నారు.