ఎడిట్ నోట్: ‘టికెట్’ గొడవలు ముంచుతాయా?

-

ఓ వైపు సీట్ల ఎంపిక ప్రక్రియ..మరోవైపు సీటు దక్కని వారిని బుజ్జగించడం..అలాగే తమ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు ఇవ్వవద్దని సొంత పార్టీలోనే నేతల డిమాండ్..అటు సీట్లు కావాలని కొందరు డిమాండ్..ఇలా ఒకటి రకరకాల పరిస్తితులు తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడిపోయింది. షెడ్యూల్ వచ్చే లోపే అభ్యర్ధులని ఫిక్స్ చేయాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికలో బిజీగా  ఉన్నారు.

అయితే బి‌ఆర్‌ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..ఒక సీటు ఖాళీ. ఇంకా 15 సీట్లలో వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు. వేరే ఎమ్మెల్యేలు ఉన్న చోట పోటీగా బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులని ఎంపిక చేయడం పెద్ద టాస్క్ గా మారిపోయింది. ఆయా సీట్లలో పోటీ ఎక్కువ ఉంది. ఇక కే‌సిఆర్ ఎలాగోలా నేతలకు సర్దిచెప్పి అభ్యర్ధులని ఎంపిక చేస్తున్నారు. ఇటు 103 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం జరుగుతుందా? అంటే ఖచ్చితంగా జరగదనే చెప్పాలి. ఎందుకంటే అందులో కొంతమందిపై ప్రజా వ్యతిరేకత ఉంది. వారికి సీట్లు ఇస్తే గెలవడం కష్టమనే పరిస్తితి. అందుకే కొందరిని పక్కన పెట్టాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు.

brs party
brs party

దాదాపు 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని పక్కన పెడుతున్నారని తెలిసింది. ఇక వారికి సర్దిచెప్పడం ఒక ఎత్తు అవుతుంది. అటు కొన్ని చోట్ల తమ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వవద్దని సొంత పార్టీ నేతలే గొడవ చేస్తున్నారు. ఇదొక రచ్చ అయిపోతుంది. సీట్లు దక్కని ఎమ్మెల్యేలు సైతం గొడవ పడుతుంది.

ఎమ్మెల్యేల అనుచరులు..సీటు ఇవ్వాలని రోడ్డు ఎక్కుతున్నారు. ఇలా ఎక్కడకక్కడ బి‌ఆర్‌ఎస్ లో రచ్చ నడుస్తుంది. అయితే ఈ రచ్చ అంతటికి చెక్ పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే ఎన్నికల సమయంలో పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటి అన్నిటిని దాటుకుని కే‌సి‌ఆర్..అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించడం పెద్ద టాస్క్ గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news