మణిపూర్ అల్లర్లకు కారణం బీజేపీనే – సీపీఐ నారాయణ

-

విజయవాడ: వచ్చే నెలలో జరిగే జీ20 సదస్సుకు ఇప్పటి నుంచే నాకా బందీ అవసరమా..? అని ప్రశ్నించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఢిల్లీ పోలీసులు ఆంక్షలు, తనిఖీలతో ఇప్పటి నుంచే ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. కొన్ని కార్యాలయాలను మూసి వేయించారని ఆరోపించారు.

మోడీ ఛైర్మన్ అయ్యారనే ఈ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. జీ 20 లొగోలో పుష్పం పెట్టి రాజకీయంగా వాడుతున్నారని ఆరోపించారు. ఇవి రాజకీయ దిగుజారుడు తనానిని నిదర్శనమన్నారు నారాయణ. మణిపూర్ మండిపొతున్నా కేంద్రం చోద్యం చూస్తుందన్నారు. గుజరాత్ తరహా కుట్రలు మణిపూర్ లొ అంతకు మించి చేశారన్నారు.

మణిపూర్ లొ విద్వేషాలు రెచ్చ గొట్టింది బిజెపినే అని.. అక్కడ అల్లర్లకు, అరాచకాలకు బిజెపినే కారణమన్నారు. హైకోర్టు ద్వారా అక్కడ ప్రభుత్వానికి డైరెక్షన్ ఇప్పించారన్నారు నారాయణ. ట్రైబల్ రక్షణకు చట్టం ఎప్పటి నుంచో ఉందని.. దీనిని బద్దలు కొట్టాలని బిజెపి చేసిన ప్రయత్నమే ఈ దాడులన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉన్నా ఈ ఘర్షణలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news