రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ ముందుందన్నారు మంత్రి హరీష్ రావు. మాతా శిశు మరణాల శాతం క్రమంగా తగ్గుతుందని తెలిపారు. నగరంలో మూడు సూపర్ స్పెషాలిటీ ఎంసిహెచ్ ఆసుపత్రులు కడుతున్నామని తెలిపారు. అలాగే గాంధీ, నిమ్స్, ఆల్వాల్, టిమ్స్ లో ఎంసిహెచ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం 600 బెడ్లు అందుబాటులో ఉంటాయన్నారు.
రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గించడమే ముఖ్యం అన్నారు హరీష్ రావు. ఇక 33 నియో నాటల్ అంబులెన్స్ లు 8 కోట్ల 7 లక్షలతో అందుబాటులోకి తెచ్చామన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీతో నియో నాటల్ అంబులెన్స్ లు డిజైన్ చేశామని తెలిపారు. రాష్ట్రంలో 72.8% ప్రభుత్వ ఆసుపత్రులలోనే డెలివరీలు జరుగుతున్నాయన్నారు. గాంధీలోని ఎనిమిదో అంతస్తులో ఆర్గాన్స్ థియేటర్ కాంప్లెక్స్ అందుబాటులోకి తేనున్నామని తెలిపారు.