ఏపీ ప్రజలకు అలర్ట్. విశాఖ ఋషికొండ పార్కింగ్ ఫీజు పెరిగింది. ఆటోలకు పాత ధరలనే వసూలు చేస్తుండగా… బస్సు, కారు, బైకుల పార్కింగ్ ఫీజులను రెండు రేట్లు పెంచారు. బస్సుకు రూ. 50గా ఉన్న రుసుమును రూ. 100, కారుకు రూ. 20గా ఉన్న ఛార్జ్ ను రూ. 50కు, బైకు రుసుమును రూ. 10 నుంచి రూ. 20కు పెంచారు అధికారులు.
పర్యాటకులు, సందర్శకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బీచ్ కు ఎంట్రీ ఫీజు వసూలుకు నిర్ణయించి… ప్రభుత్వం వెనక్కు తిరిగింది. ఇది ఇలా ఉండగా, ఏపీ ప్రభుత్వం ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో స్పెషల్ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తుంది. ఆగస్టు 22 నుంచి అంటే రేపటి నుంచి క్యాంపులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 22, 23, 24, 25 తేదీల్లో మొత్తం నాలుగు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది.